వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ...... గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు.