వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మండలి చైర్న్ మోషేన్ రాజు మాట్లాడుతూ..... అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతోంది. ఇదే సామాజిక న్యాయం. అంబేద్కర్ ఆశించినట్లు దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి వచ్చేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయంగా నేను శాసనమండలి చైర్మన్‌గా ఉన్నానంటే సీఎం జగన్ సామాజిక సాధికారత చర్యల్లో భాగమే. బీసీవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా, నందిగం సురేష్ ఎంపీగా అయ్యారంటే కారణం సీఎం జగన్. జగనన్న పాలనలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎలాంటి లంచాలు లేకుండా, రికమెండేషన్లు లేకుండా అందుతున్నాయి. మహిళా సాధికారత సాకారమైంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే, సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లీషు మీడియం చదువు, బ్యాగులు, షూ, కార్పొరేట్ చదువు దక్కుతోంది. 56 కార్పొరేషన్లు ఇవ్వడం ద్వారా బడుగు బలహీనవర్గాలు, దళితులను గౌరవం పెంచిన చరిత్ర సీఎం జగన్‌ది.అంబేద్కర్ కోరుకున్నట్టుగా సాధికారత సీఎం జగన్ సాధించారన్నారు.