వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ.... 2019 ఎన్నికల ముందు మీ అందరి దగ్గరికీ వచ్చాం. హామీలిచ్చాం. జగనన్నను గెలిపిస్తే అమ్మ ఒడి ద్వారా స్కూలుకు పంపితే 15 వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. అమ్మ ఒడి హామీ నిలబెట్టుకున్నాం. జగనన్నను గెలిపిస్తే రైతు భరోసా కింద డబ్బులు వేస్తామని హామీ ఇచ్చాం. నిలబెట్టుకున్నాం. డ్వాక్రా రుణాలు నాలుగు దఫాలుగా తిరిగిస్తామని చెప్పాం. మూడు విడతలూ వచ్చాయి. ఇదే జగనన్న నైజం. చంద్రబాబు మీటింగ్ పెట్టి మహిళలతో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. అందరూ చంద్రబాబుకు ఓటేశారు. ఏమైంది? రుణమాఫీ చేయలేదు. చేయూత ద్వారా ఏటా రూ.18,750, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేలు, ఆటో సోదరులకు రూ.10 వేలు, రజకులకు రూ.10 వేలు, మత్స్యకార భరోసా రూ.10 వేలు, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా.. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్న జగనన్న. అందుకే ఈరోజు ధైర్యంగా ప్రతి గడపకూ వచ్చి మీకు లబ్ధి జరిగిన విషయాన్ని చెబుతున్నాం. 2019 మేనిఫెస్టోని పట్టుకొని హామీలన్నీ నెరవేర్చాం అని ధైర్యంగా చెబుతాం. కానీ 2014 టీడీపీ మేనిఫెస్టో పట్టుకొని వాళ్లు చెప్పగలరా? వైయస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా రుణాలకు పావలా వడ్డీ గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. చెప్పుకోడానికి ఏదైనా ఒక్క పథకమైనా ఉందా? జగనన్న పేరు చెబితే రెండు రోజులు మాట్లాడుకొనేలా పథకాలు గుర్తుకొస్తాయి. పథకాలు అందుకొనేందుకు నాయకులు, అధికారుల చుట్టూ ఎవరూ తిరగడంలేదు. వాలంటీర్ల ద్వారా పథకాలు నేరుగా అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకొనే అవకాశం కల్పించిన గొప్ప సీఎం జగనన్న. మనకు కష్టకాలంలో అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, జగనన్నను గెలిపిద్దాం అని అన్నారు.