ఆందోళన తెలియజేస్తున్న ఓ మహిళను నడిరోడ్డుపై ఓ భద్రతాధికారి క్రూరంగా చితకబాదాడు. అధికార కాన్వాయ్ వెళ్తుండగా సదరు మహిళ.. మైక్ పట్టుకుని నినాదాలు చేసింది.
వెనుక నుంచి ఓ భద్రతాధికారి దూసుకువచ్చి.. మహిళను మెడపట్టుకుని, రోడ్డుపై పడేశాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వీడియోలో మాత్రం ‘క్యూబా’ జాతీయజెండాలు కనిపిస్తున్నాయి.