తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురం బ్రహ్మంగారి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు రైల్వే పట్టాలపై 55 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇతని శరీరం పలు వస్తువులను పరిశీలించగా ముస్లిం వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. ఆచూకీ తెలిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై వివరించారు.