విజయవాడ నగరంలో ఈనెల 9వ తేదీ మంగళవారం నిర్వహించనున్న 36 గంటల ధర్నాకు వెళ్లకుండా ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని శ్రీ సత్యసాయి జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. యూటీఎఫ్ దశల వారి ఉద్యమాలలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని నిర్వహించనున్న ధర్నాకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారన్నారు.