రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని ఆదరించాలని ఆ పార్టీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్చార్జ్ జె. సి అశ్మిత్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన పట్టణంలోని 24వవార్డులోని అంబాభవానివీధి, శాస్త్రినగర్, కెవి రెడ్డినగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలు, వారి స్థితిగతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.