వైఎస్సార్ ఏసీఏ కడప స్టేడియంలో బీసీసీఐ సికే నాయుడు అండర్-23 అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి సోమవారం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఆదివారం నుంచి ఆంధ్ర, గోవా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టులో జిల్లాకు చెందిన మచ్చా దత్తారెడ్డి కేవలం 86 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.