ఉరవకొండ పట్టణంలోని 10వ వార్డులోని ప్రజలు చౌక బియ్యం పంపిణీ చేయడం లేదని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గతంలో విజిలెన్స్ అధికారులు వార్డులోని చౌకదుకాణాన్ని సీజ్ చేశారు. దీంతో కార్డుదారులకు మరో దుకాణంలో బియ్యం తీసుకోవాలని సూచించారు. సదరు డీలర్ వారికి బియ్యం లేవని చెబుతున్నారని కార్డుదారులు తహసీల్దారు శ్రీధర్ మూర్తికి విన్నవించుకున్నారు. పరిశీలించి బియ్యం పంపిణీ చేస్తామన్నారు.