వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిందని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సర్కారు పాపాలు.. పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు.
పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని.. విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం’ అని పిలుపునిచ్చారు.