భారతదేశంలో అరకు కాఫీ తనదైన ముద్ర వేసుకుంది. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఈ కాఫీ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకుంది. 1898లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంటను వేశారు. అది క్రమక్రమేపి అరకులోయలోని అనంతగిరి,చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారత్ ఏడోస్థానంలో ఉంది.