ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలీసాబెత్ బోర్నే పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై ఫ్రాన్స్‌లో రాజకీయ ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకునారు.
ఈ చట్టానికి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మద్దతిస్తున్నారు. కొందరు విదేశీయులను దేశం నుంచి పంపించేయడంతోపాటు మరికొన్ని చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఈ చట్టం అధికారం కల్పిస్తున్నది.