వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
రాజకీయాల కోసం ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. కాగా రేపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు మేధావి వర్గం కలిసి వస్తోందోన్నారు.