యోగి వేమన విశ్వవిద్యాలయంలో సంక్రాంతి ముందే వచ్చేసింది. సోమవారం గురుకుల ప్రాంగణం ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలతో అలరారగా, యువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టడంలో పోటీ పడగా, సాంప్రదాయ కోలాటాలు, హరిదాసు సంకీర్తనలతో విశ్వవిద్యాలయం సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగ సాగాయి. ఉత్సవాలకు వీసి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పిల్లలను ఆశీర్వదించు, బోగి మంటలు, సంక్రాంతి లక్ష్మీకి పూజచేసి పండుగను ఆహ్వానించారు.