వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మాజీ ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ.... ఈరోజు ప్రతి ఒక్క సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపి,వారికి అధికారపదవులు ఇచ్చారు జగనన్న. గతంలో ఎన్నడూ లేని రీతిలో పరిపాలన అందిస్తున్నారు జగనన్న. వలంటీర్ల ద్వారా సంక్షేమపథకాలు ఇంటి దగ్గరే అందేలా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.ఆరోగ్యశ్రీని ఎంతో బలోపేతం చేసి..పేదల పాలిట దేవుడే అయ్యాడు జగనన్న. మహిళల గురించి ప్రత్యేకంగా ఆలోచించే జగనన్న..వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇళ్లపట్టాలు మహిళల పేరునే ఇస్తున్నారు. కరోనాలాంటి కష్టకాలంలో జగనన్న పాలించిన తీరు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ధైర్యాన్ని నూరిపోయడమే కాదు..ఆర్థిక సాయం కూడా అందించి కరోనా కాలంలో జగనన్న దేవుడే అయ్యారు.చంద్రబాబును నమ్మితే మనం కష్టాలు పడాల్సిందే. సంక్షేమపథకాలు అమలు కావాలన్నా..పేదల జీవితాలు బాగుపడాలన్నా జగనన్నే మళ్లీ రావాలి అని పిలుపునిచ్చారు.