వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.... ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు అన్ని కులాలుకూ సేవచేసేవాళ్లు. ఈరోజు మాలోనే ఎమ్మెల్యేలు అయ్యారు. గతంలోనూ ఎమ్మెల్యేలయి ఉన్నారు. అయినా నాడు వారికి స్వేచ్ఛ లేదు. అధికారం లేదు. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. ఈరోజు జగనన్న వచ్చారు. ఆయనకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల వారంటే ప్రేమ. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. జగనన్న పాలన చూసి మనమంతా సంతోషపడాలి. జగనన్న పాలనలోనే మన కుటుంబాలు బాగుపడ్డాయి. భవిష్యత్తులోనూ బాగుండాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల గుండెల్లో దేవుడిగా కొలువైనాడు జగనన్న. ఐదుగురు బీసీలను రాజ్యసభ మెంబర్లను చేసిన జగనన్న, కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి...వాటిలో ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులిచ్చి వారి స్థాయిని పెంచిన ఘనత జగనన్నదే. తనకు ఓటేసిన వారిని మోసం చేసే గుణమున్నవాడు చంద్రబాబు. జగనన్న తనకు ఓటు వేసినవారికి సేవ చేశాడు. చేస్తున్నాడు. మాట తప్పని కులం, మడమ తిప్పని మతం జగనన్నది. కూలీవాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు. కూలీవాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచన చేసి..అందుకోసం ఏమి చేయాలో అదంతా చేస్తున్నాడు జగనన్న. చదువు పేదల తలరాతలు మారుస్తుందని..ఆ రంగంలో విప్లవాత్మకమార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.