ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 02:45 PM

అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  విజ్ఞప్తి చేశారు.  ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు.  అంగన్ వాడీలు, మున్సిపల్ వర్కర్లు పట్టుదలకు పోకుండా వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమ్మె ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది. గర్భిణులు,బాలింతలు,పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.వారు అడిగిన డిమాండ్లలో వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించిన విషయం సహృదయంతో అర్ధం చేసుకోవాలి. పరిష్కారమయ్యే వాటికి జగన్ గారు ఆమోదం తెలియచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com