వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైయస్ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ దీపిక, ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మలను నిలబెడుతున్నామని, వీరిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని మంత్రి అభ్యర్థించారు. సోమవారం హిందూపురం రూరల్ మండలం కొటిపి గ్రామ పంచాయతీలో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. కొటిపి గ్రామపంచాయతీలో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, నాడు నేడు ద్వారా స్కూల్ రూపురేఖలు మార్చారు. గ్రామపంచాయతీలో సిసి రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులకు దాదాపు రూ.247 లక్ష రూపాయల అభివృద్ధి జరిగిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అబ్జర్వర్ రెడ్డిఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మహిళా నాయకురాలు మధుమతి రెడ్డి, జోత్స్న రెడ్డి, జడ్పిటిసి నాగభూషణప్ప, ఎంపీపీ రత్నమ్మ, ఏడీసీసీ చైర్మన్ లిఖిత, సర్పంచ్ సరస్వతి ఆదెప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి హనుమంత రెడ్డి, బసిరెడ్డి తదితర మండల అధికారులు పాల్గొన్నారు.