రాష్ట్రంలో అగన్వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోరాటంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తమ సమ్మెపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించామంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన సమ్మె విరమించేది లేదన్నారు. నోటీసులు ఇచ్చినా, బెదిరించినా వెనక్కి తగ్గమన్నారు. ప్రభుత్వం స్పందన బట్టే సమ్మెపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కక్ష సాధిస్తారా అంటూ అంగన్వాడీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.