అంగన్‌వాడీ మహిళల పోరాటంపై ఎస్మా చట్టాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాల నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. జైల్ భరోకు పిలుపునిస్తూ కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాల నేతలు ర్యాలీ చేపట్టాయి. అలంకార్ సెంటర్లో అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క ఛాన్స్ అని మాయ మాటలతో జగన్ మోసం చేశారన్నారు. ‘‘వేతనాలు పెంచుతామని జగన్ హామీ ఇచ్చింది నిజం కాదా? ఈరోజు ఇంతమంది రోడ్డు ఎక్కారంటే జగన్ కారణం కాదా? సమస్య పరిష్కరించకుండా వారి పై ఎస్మా చట్టం తేవడం దుర్మార్గం. అక్రమ అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు. మహిళలతో కన్నీరు పెట్టించిన వారెవ్వరూ బాగు పడలేదు. మూడు నెలల్లో జగన్‌ను ఇంటికి పంపించి తీరుతాం’’ అని కార్మిక సంఘాలు హెచ్చిరిస్తున్నాయి.