శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిర్వేదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫేస్బుక్ లైవ్లో పద్మావతి తన ఆవేదనను వెలిబుచ్చారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతీసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు. ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారన్నారు. ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్ప.. సమస్యను ఏనాడూ పరిష్కరించలేదని పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.