వేటపాలెం మండలం కొనిజేటి చేనేతపురిలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. లేళ్ల విజయలక్ష్మి(43) మంగళవారం అంతా ఇంటి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ సురేష్ అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా లోన విజయలక్ష్మి ఉరేసుకుని ఉంది. కొడుకు శంకర్ ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాదు వెళ్లి ఉండగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.