ప్రైవేట్ బ్యాంక్ రుణాల వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో 7 లక్షలను గోళ్ల అజయ్ ( 27) లోన్ తీసుకున్నాడు. లోను తీసుకున్న దగ్గరి నుంచి క్రమం తప్పకుండా అతను వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో డిసెంబర్ నెల ఆయన లోను కట్టలేదు. అయితే వాయిదా చెల్లించాలని రికవరీ ఏజెంట్లు అతనిపై తీవ్ర వత్తిడి చేశారు. ప్రైవేట్ బ్యాంక్ నిర్వాహకుల వత్తిడి తట్టుకోలేక అజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అజయ్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అజయ్ దాచేపల్లి మండలం నడికూడి వాసిగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa