కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఆంధ్రరత్నా భవన్లో బుధవారం పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాణిక్కం ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో డీవై దాస్, డేవిడ్ రాజు, నిర్మాత కల్యాణ్ చక్రవర్తి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ దేశానికి ప్రధానిగా మోదీ ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు. అలాగే ఇతర ప్రాజెక్టులు ఏవీ అమల్లోకి రావని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయని తెలిపారు. ఏపీ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.