విశాఖలో అస్తిపంజరం కలకలం రేపింది. పెదగంట్యాడ మండలం అప్పికొండ బీచ్ దగ్గర ఇసుకలో అస్తిపంజరం బయటపడింది. పర్యాటకుల కాళ్లకు ఆ అస్తిపంజరం తగలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వారి సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు.. మొఖం, కాలి భాగంలో చర్మం ఉన్నట్లు గుర్తించారు. సముద్రం నుంచి కొట్టుకొచ్చిందా లేదా ఎవరైనా పాతిపెట్టరా అని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa