రెండు నెలల సమయంలో 400మందికి పైగా మయన్మార్ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. మయన్మార్లో జుంటా ప్రభుత్వం,
తిరుగుబాటు బలగాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలోనే ఈ చొరబాట్లు జరిగాయని చెప్పారు. భారత్లోకి వచ్చిన మయన్మార్ బలగాలను రోజుల వ్యవధిలోనే తిరిగి వారి దేశానికి పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు.