ఇటీవలి కాలంలో భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్గనిస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించగా,
రిక్టర్ స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదైంది. ఈ మేరకు భూమి లోపల 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియల్సి ఉంది.