అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పుడు రాతలేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కొట్టిపారేశారు. ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో 22 శాతం అప్పు పెరిగిందన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఖర్చు చేసే ప్రతీ రూపాయికి లెక్క ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏ ఆధారాలతో ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అప్పులపై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజనకు, విభజన తరువాత ప్రత్యేక హోదా కోల్పోవడానికి కూడా చంద్రబాబే ప్రధాన కారణమన్నారు. టీడీపీ హయాంలో రూ.2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చింది.చంద్రబాబు ప్రతీ ఊరికి వెళ్లి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా?. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయి. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజీ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు అని మంత్రి బుగ్గన అన్నారు.