వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికీ, సంక్షేమానికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. కిష్టప్పపేటలో మంత్రి ధర్మాన పర్యటించి రూ.66.42 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సంబంధిత నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. రూ.15.80 లక్షల వ్యయంతో నిర్మించిన వెల్నెస్ సెంటర్-ను, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,రూ.28.84 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ స్కూల్ ప్రహరీని ప్రారంభించారు. అదేవిధంగా ఇదే గ్రామంలో ప్రతిపాదిత బస్ షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.