అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైయస్ఆర్‌సీపీ మూడో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
పార్లమెంట్ అభ్యర్థులు.
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ,
విజయవాడ ఎంపీగా కేశినేని నాని,
కర్నూల్ ఎంపీగా గుమ్మనూరి జయరాం,
తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం,
టెక్కలి ఎంపీగా పేరాడ తిలక్
ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్