రాష్ట్రంలో మళ్లీ వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను నెల్లూరు రూరల్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ నేతలు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేస్తా.. గెలిచి తీరుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది.. జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినా.. వారికీ ఓట్ల శాతం తగ్గడం తప్ప.. మాకు నష్టం లేదన్నారు.