చిరువ్యాపారస్తులు, కులవృత్తుల మీద ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని, రూ. 6 నుంచి రూ. 10 వడ్డీ వసూలు చేసేవారు, రూ. 10,000 లోన్ కు గాను రూ. 9,000 మాత్రమే ఇచ్చి మళ్ళీ రూ. 10,000 వసూలు చేసేవారు. ఆ పరిస్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ. 10,000 ఇవ్వడం, వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించడం, ఏటా బ్యాంకర్లతో సమావేశమై వారికి అవసరమైన సహాయం చేయడం, రూ. 10,000 ఇచ్చే లోన్ ఇప్పుడు రూ. 13,000 వరకూ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఆ కుటుంబాలన్నీ కూడా మేం గడప గడపకూ వెళ్లినప్పుడు మాకు సంతోషంగా చెబుతున్నాయి, సీఎంగారికి మీ ద్వారా మా ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు.