పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ ఏపీలో కాక రేపుతోంది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనను తొలగించి, ఎంపీ వంగా గీతను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయించింది.
దీంతో ఆయనకు ఈ దఫా సీటు లేదన్న అంశం స్పష్టమైంది. నేడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు బర్త్డే. దీంతో జన్మదిన వేడుకల్లో ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.