తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు. ఈ మూడు కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారంలోగా విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని, బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.