ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుర్తించామని వెల్లడించారు. వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని.. దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ స్కిల్స్ బోధించేందుకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు వెల్లడించారు.