చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్కు వివరించాం అని విజయసాయిరెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ.... రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.