వైసీపీ శ్రేణులకు తాను అన్నం పెడితే, ఆ పార్టీ తనకు సున్నం పెట్టిందని గన్నవరం తెలుగుదేశం ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు ఉండవల్లిలో యువనేత లోకేష్‌ని కలిశారు. ఈ భేటీలో కృష్ణా జిల్లాలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ నుంచి తన పాత మిత్రులెందరో తెలుగుదేశంలో చేరేందుకు తనని సంప్రదిస్తున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆచి తూచి ముందుకెళ్లామని తనతో లోకేష్ అన్నారని వెంకట్రావు చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ బాగు కోసం తనలా తెలుగుదేశంలో ఉండటమే సబబని తన పాత వైసీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని చెప్పారు.