సంక్రాంతి వచ్చిందంటే నాటుకోళ్లకు మస్త్ గిరాకీ ఉంటుంది. దీంతో నాటుకోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో లభించే కోడిపుంజుల ధరలు రెండు, మూడింతలు పెరిగాయి.
అయినప్పటికీ శివారు ప్రాంతాల్లో జరిగే సంతల్లో వాటి విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణంగా ఇక్కడ కోడిపుంజు రూ.250 వరకు దొరుకుతుంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఒక్కో పుంజును రూ.800 నుంచి రూ.మూడువేల వరకు విక్రయించారు.