ప్రపంచంలోనే తొలి నిపా వ్యాక్సిన్ మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ విధానంలో ఆస్ట్రాజెనెకా, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉపయోగించిన అదే సాంకేతికత ఆధారంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు.
నిపా వైరస్ కోసం తయారు చేయబడిన ChAdOx1 NiV అని పిలిచే ఈ వ్యాక్సిన్ ప్రిలినికల్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత, హ్యూమన్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది.