భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. భోగి మంటలో పాత వస్తువులను వేసి, ఆవు పిడకలను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో, గడపను పసుపుకుంకుమలతో అలంకరించాలి.
ఆవు పేడతో గొబ్బిళ్లు చేసి వాటిని వాకిలి ముంగిట వేసిన ముగ్గులు మీద పెట్టి వాటి మధ్యలోగుమ్మడి పువ్వు పెడతారు. మండువాలో వరి కంకులను వేలాడదీయాలి. కొత్త బెల్లం ఆవు పాలు పోసి పులగం చేయాలి.