సంక్రాంతి రోజున అంగన్వాడీలను సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డున పడేశారని, యువతకు ఉపాధి కల్పించేలా టీడీపీ - జనసేన పార్టీ భరోసా ఇస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత ఈ రెండు పార్టీలదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం కూడా రాకుండా చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. చీకటి జీవోలను మంటల్లో వేశామని, జగన్ అహంకారాన్ని కూడా మంటల్లో వేశామన్నారు. కాగా గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో బోగి మంటల వేడుకలు జరిగాయి. ‘కీడు తొలగాలి... ఏపీ వెలగాలి’ పేరుతో బోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవో ప్రతులను బోగి మంటల్లో దగ్దం చేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లను టీడీపీ నేతలు తగలబెట్టారు.