ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో పండుగ మూడు రోజులు కోడి పందాలు జోరుగా సాగుతాయి.
ఇప్పటికే సిద్ధం చేసిన భారీ బరుల్లో కోడి పుంజులు కాలు దువ్వుతున్నాయి. హైటెక్ హంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో కోడి పందాలు ఊపందుకున్నాయి.