ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం జగన్కు ఆడపడుచులు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం.. దంపతులిద్దరు కలిసి బసవన్నకు బట్టలు పెట్టారు. ఆ తర్వాత.. అంతా కలిసి భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్బంగా.. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్.. భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిగా జగన్ అభివర్ణించారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.