ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు. జగన్ దంపతులు ఆ నమూనా ఆలయంలో పూజలు జరిపారు. శఠగోపం పెట్టించుకున్నారు. ఒకరికి ఒకరు కుంకుమ దిద్దుకుని స్వామిని సేవించారు. అక్కడి పరిసరాలను కూడా అచ్చం పల్లెటూరు అందాలు, అద్భుతమైన కళాఖండాలు, ఆలయం, ఇంకా ప్రముఖమైన కళాకృతులతో నింపేశారు. మినీ పల్లెటూరును తలపించిన ఆ వాతావరణంలో జగన్ దంపతులు కలియదిరిగారు.