వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరబల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటల్లో ఆహుతి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు భోగి పండుగ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేసి సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరబల్లి మండల టీడీపీ అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు అన్ని ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినవేనని ఆయన వివర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జయచంద్రారెడ్డి, వీరబల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులురెడ్డి, టీడీపీ యువనాయకులు ధీరజ్‌రెడ్డి, ఐటీడీపీ పవన, శివకుమార్, వినయ్, నరసింహులు, మహేశ, బీసీ నాయకులు సుబ్బరామయ్య, కేంపల్లె రమణ, గిరి తదితరులు పాల్గొన్నారు.