రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, షర్మిల తదితరులు మణిపూర్‌కు వెళ్లారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ఆఫీసు బేరర్లు కూడా మణిపూర్ సభలో పాల్గొన్నారు. సభ పూర్తి కాగానే రాహుల్ బస్సులో జోడో యాత్రను ప్రారంభించారు. థోబాల్ ప్రాంతంలో స్థానికులతో టీ తాగుతూ ముచ్చటించారు. బీఎస్పీ నుంచి సస్పెండైన డానిష్ అలీ కూడా యాత్రలో పాల్గొనడం విశేషం.