సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని టీడీపీ పార్లమెంట్ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి దామోర్నాయుడు తెలిపారు. సోమవారం వైసీపీ అరాచక పాలన దూరం కావాలని సుండుపల్లె మండల కేంద్రంలో భోగి మంటలను వేశారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, అది టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుతోనే సాధ్యం అన్నారు. మండల మైనార్టీ నాయకులు మేకల మహబూబ్‌బాషా, మండల ఉపాధ్యక్షుడు యర్రంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజానాయుడు, బలరామరాజు, జనసేన నాయకులు, రామ శ్రీనివాసులు పాల్గొన్నారు.