వైసీపీ ఎంపీ బీ-ఫాం కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్రహీంపట్నంలో ఉమా విలేకరులతో మాట్లాడారు. మైలవరం వీరప్పన్‌తో చెట్టాపట్టాలేసుకుని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపల్ ఫలితాలు వచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరిపడుతుంటే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంతలు చెరో పక్క చిద్విలాసం చిందిస్తూ కూర్చున్నారని అది రాజకీయ వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు.