ఏపీలోని అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో ఇప్పటికీ ఓ వింత ఆచారం ఉంది. ఈ ఊరిలోని కాడుగొల్ల అనే తెగకు చెందిన వారు ఎవరైనా తమ ఇళ్లలో మహిళలు బాలింతలైతే, వారిని ఇంట్లోకి రానివ్వరు.
దాదాపు 3 నెలలు ఊరి పొలిమేర అవతల పాక వేసి, అక్కడ ఉంచుతారు. వారిని ఎవరూ ముట్టుకోకూడదట. అందుకే ఈ ప్రాంత బాలింతలు ఎవరి సహాయం లేకుండా ఒక వైపు బిడ్డను చూసుకుంటూనే, తన వంట తాము చేసుకుంటూ తింటుంటారు.