గుడికి వెళ్లిన భక్తులు చాలా మంది గుడి వెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. కారణం గర్భాలయంలో మూల విరాట్టుని వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు.
నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. ఈ మంత్ర శక్తికి దగ్గరగా గర్భాలయంలో వెనుక వైపు గోడ ఉండటంతో భక్తులు ఆగి తపశ్శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది.